* లారీని ఢీ కొట్టిన డబుల్ డెక్కర్ బస్
* యూపీ అలీఘర్ జిల్లాలో ప్రమాదం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ (Uttarpradhesh)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. అలీఘర్(Alighar)లోని తప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవే(yamuna express highway)పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ట్రక్కు, డబుల్ డెక్టర్ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన కృష్ణా ట్రావెల్స్‌కు చెందిన డబుల్ డెక్కర్ బస్సు (Double Deccer Bus)ఢిల్లీ నుంచి అజాంగఢ్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పాయింట్ నంబర్ 56కి చేరుకోగానే వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సు భారీగా ధ్వంసమైంది. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
