* గౌరవ వందనం స్వీకరించిన డీజీపీ జితేందర్
* త్వరలో విధుల్లోకి 1211 మంది కానిస్టేబుళ్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని రాజా బహదూర్ వెంకటరామ రెడ్డి తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ (Passing Out Parade) ఉత్సాహంగా సాగింది. 9 నెలల పాటు శిక్షణ తీసుకున్న 1211 మంది సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్ సీపీఎల్, ఐటీఅండ్‌సీ, పీటీవో కానిస్టేబుళ్లు త్వరలో విధుల్లో చేరనున్నారు. పోలీస్ ఔట్ పరేడ్‌లో కానిస్టేబుళ్ల నుంచి డీజీపీ జితేందర్(Dgp Jitendar) గౌరవ వందనం స్వీకరించారు. వారితో అకాడమీ చీఫ్ అభిలాష బిస్త్ ప్రమాణం చేయించారు. పరేడ్‌కు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమగిరికి చెందిన కుమారి ఉప్పునూతల సౌమ్య కమాండర్‌గా వ్యవహరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 2,338 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండగా, 5,709 మంది పురుషులు ఉన్నారు.
……………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
