* రెండు రోజుల పాటు అక్కడే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు(HARISH RAO) రెండు రోజులపాటు ఖమ్మంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన ఖమ్మం(KHAMAM) చేరుకున్నారు. చింతకాని మండలాల్లో పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సహా ఇతర నేతలు ఆయనకు స్వాగతం పలికారు. లగచర్ల రైతులకు మద్దతుగా ఖమ్మంలో నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. పత్తి, మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శిస్తారు. అనంతరం చింతకాని మండలంలో రైతులను కలుసుకుని సమస్యలపై చర్చించనున్నారు. రేపు కూడా హరీశ్‌రావు ఖమ్మం పర్యటన కొనసాగుతుందని బీఆర్ ఎస్(Brs) నేతలు పేర్కొన్నారు. ఈమేరకు సన్నాహక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
