ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినీహీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వేసిన పరువు నష్టం దావాపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఈరోజు కౌంటర్ దాఖలు చేశారు. నాగార్జున కుటుంబ సభ్యులపై కొండా సురేఖ గతంలో చేసిన చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు తన కుటుంబ పరువుకు భంగం కలిగించాయని, తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ కొండా సురేఖపై నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసులో ఇప్పటికే నాగార్జున వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కేసులో నాగార్జున పిటిషన్‌కు కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టాల్సి ఉంది.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
