PM addressing the media ahead of the Winter Session of Parliament at Parliament House, in New Delhi on November 25, 2024.
* మనమంతా కలసికట్టుగా ముందుకు సాగాలి
* రాజ్యాంగం ఆవిర్భవించి నేటికి 75 ఏళ్లు
* సంవిధాన్ సదన్‌లో నేడు రాజ్యాంగ దినోత్సవం
* పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో ప్రధాని మోడీ
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రజలతో తిరస్కరణకు గురైన వారు పార్లమెంట్‌ను నియంత్రించే పనిలో ఉన్నారని ప్రధాని మోడీ (PM MODI) అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలపై చర్చకు అంతా సిద్దంగా ఉండాలని, ప్రభుత్వం అందుకు సంసిద్దంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల విూడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోదీ కోరారు. ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నామన్నారు. పార్లమెంట్లో ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. విపక్షాలను టార్గెట్ చేస్తూ.. పార్లమెంట్లో చర్చకు అనుమతించడం లేదని ఆరోపించారు. ఇది 2024 సంవత్సరానికి చివరి కాలం’ అని ప్రధాని అన్నారు. 2025 కోసం దేశం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం. దానికి గుర్తుగా సంవిధాన్ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని మోదీ అన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
