* సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే
ఆకేరున్యూస్, ముంబై: సీఎం పదవిపై మోదీ నిర్ణయమే ఫైనల్ అని ఏక్నాథ్ షిండే (EKNATH SHINDE) అన్నారు. మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపారు. బుధవారం థానేలో ఆయన నివాసంలో షిండే మీడియాతో మాట్లాడుతూ.. మహాయుతి గెలుపు కోసం కార్యకర్తగా పనిచేశానని.. తమ పార్టీకి అతిపెద్ద విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ప్రధాని మోదీ పూర్తి మద్దతు ఉందని ఏక్నాథ్ షిండే తెలిపారు. పేరు కోసం పాకులాడటం తనకు ఇష్టం ఉండదని.. అధికారంలో ఉన్నప్పుడు తాను, తన సహచరమంత్రులు 24/7 పనిచేశామని తెలిపారు. ఇక మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలో బీజేపీ హైకమాండ్ నిర్ణయానికే వదిలేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిపై మోదీ, అమిత్షా నిర్ణయమే ఫైనల్ అని.. వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
