ఆకేరున్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ అంబర్‌పేటలో వీహెచ్ (VH) ఇంటి ముందు పార్క్ చేసిన కారును బుధవారం తెల్లవారుజామున దుండగులు ఓ వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీహెచ్ ఫిర్యాదుతో అంబర్‌పేటలోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి సీసీ కెమెరాలను పరిశీలించి కారు నంబర్ ప్లేట్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
