Published:
Updated: 28 Nov 2024 • 03:56 AM
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సైతం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాస్ ఉన్నారు.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
