* టెన్నిస్ టోర్నమెంట్‌ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
* టెన్నిస్ ఆడి సందడి చేసిన ఎమ్మెల్యే
ఆకేరున్యూస్, వరంగల్: కాకతీయులు పరిపాలించిన గడ్డపై జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో ఆడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు అన్నారు. దేశ వ్యాప్తంగా వస్తున్నా క్రీడాకారులకు ఓరుగల్లు అతిద్యం ఇవ్వడం దీనికి జిల్లా టెన్నిస్ కమిటీతో వరంగల్ క్లబ్ తీసుకొన్న చొరవ గర్వకారణమన్నారు. భవిషత్తులో ఇలాంటి టోర్నమెంట్లు ఇక్కడ జరిగే విధంగా చొరవ చూపాలని అన్నారు. హనుమకొండ జిల్లా సుబేదారిలోని వరంగల్ క్లబ్లో సీనియర్ టెన్నిస్ క్రీడాకారుడు దివంగత శ్రీనివాస్ గౌడ్ జ్ఞాపకార్థం 2లక్షల 50వేల రూపాయల బహుమతితో వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నేషనల్ లెవెల్ మెన్స్ ఓపెన్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్ క్లబ్ టెన్నిస్ ఆర్గనైజేషన్‌తో కలసి టెన్నిస్ ఓపెన్ టోర్నమెంట్‌కు టాస్ వేసి ప్రారంభించారు.
ఆల్ ఇండియా నుంచి విచ్చేసిన మెంటర్స్, క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా విశిష్టతను కాకతీయుల నాటి కళ ఖండాలను వీక్షించి కాకతీయ చరిత్రను ఇక్కడ ఉన్న ప్రాచీనమైన దేవాలయాలను దర్శించుకోవాలన్నారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా ఆడారు. అనంతరం వరంగల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, మాట్లాడుతూ మా అసోసియేషన్ అందరికి ఆత్మీయ స్నేహితుడు టెన్నిస్ ప్లేయర్ దివంగత శ్రీనివాస్ జ్ఞాపకార్ధం జాతీయ స్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని.. భవిష్యత్తులో కూడా వరంగల్‌లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ క్లబ్ సెక్రటరీ రవీందర్ రెడ్డి..జిల్లా షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రమేష్ కుమార్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి మనోహర్ రెడ్డి ఉపాధ్యక్షులు ఎల్లా మురుగన్ , రాజేశ్వరరావు, ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రావు, ప్రవీణ్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ కన్నారెడ్డి పురుషోత్తం రెడ్డి, గోపాల్ రావు, ఈసీ మెంబర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..