* భారీగా ఆస్తుల గుర్తింపు
* రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్కుమార్(AEE NIKESH KUMAR) ఇంట్లో ఏసీబీ సోదాలు(ACB RIDES) నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 6 గంటల నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 150 కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు తెలిసింది. ఆయన నివాసం, సమీప బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. వ్యవసాయ భూములు, బిల్డింగ్స్, ఫాం హూస్ తదితర ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్, పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఏసీబీ గుర్తించిన అక్రమాస్తుల విలువ వంద నుంచి రూ.150 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
