* గురుకుల పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు
* విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విశ్వేశ్వరరావు
ఆకేరున్యూస్, కమలాపూర్: గురుకుల పాఠశాలల్లో శుభ్రత పాటించాలని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు అన్నారు. కమలాపూర్ మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాల, బాలికల పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలను శనివారం రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూంలను పరిశీలించారు. వంట సరుకులు, కూరగాయలను పరిశీలించి శుచీ, శుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. విద్యాబోధన, భోజన మెనూ వివరాలను ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు విద్యార్థులకు నాణ్యమైన , రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్ లకు, నిర్వాహకులకు సూచించారు. మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హన్మకొండ జిల్లా డిఇఓ వాసంతి, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్ రెడ్డి, ఐసీడీఎస్ జిల్లా ఉన్నతాధికారి రమాదేవి, ఎంపీడీవో బాబు ఎంఈఓ రామ్ కిషన్ రాజు, ప్రిన్సిపాల్ లు డాక్టర్ తాడూరి రవీందర్, వీ. సౌజన్య , కేజీబీవీ ఏస్ఓ అర్చన , బీసీ సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
…………………………………………….