* రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తాం
* బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దు
* రైతులకు.. పేదలకు ఒకేసారి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు, పేదలకు సీఎం రేవంత్‌రెడ్డి (REVANTH REDDY) గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాతే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమచేస్తామని.. అలాగే రేషన్‌కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో రైతులు, పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సీఎం మీడియాతో మాట్లాడారు. రైతు భరోసాపై విధివిధానాల ఖరారుకు కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. కార్యాచరణపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. ఎవరు అడ్డుపడినా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతల మాటలు రైతులు నమ్మొద్దని రైతులకు సూచించారు. రూ. 16 వేల కోట్ల మిగులుతో తెలంగాణను కేసీఆర్‌కు అందిస్తే, పదేళ్ల తర్వాత రూ.7 లక్షల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారన్నారు. ఇన్నేళ్ల కాలంలో ఏ సర్కార్ ఇంత తక్కువ కాలంలో రుణమాఫీ చేయలేదనన్నారు. ఇప్పటి వరకు 25లక్షల 35వేల మంది రైతులకు 21,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని.. ఈలాగే రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ చేశామన్నారు. అలాగే రేషన్ కార్డులు ఉన్న పత్రిఒక్కరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
