ఆకేరు న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌లో కలియతిరుగుతూ కూల్‌డ్రిరక్ తయారీ వివరాలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ ఉన్నారు. సీఎం పర్యటన సందర్భంగా కంపెనీలోకి కాంగ్రెస్ నేత నర్సారెడ్డిని పోలీసులు అనుమతించకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ గేటు ధ్వంసం చేసి కార్యకర్తలు లోపలికి దూసుచ్చినట్లు సమాచారం.
…………………………………