Published:
Updated: 03 Dec 2024 • 04:12 AM
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వచ్చే వారం రాజ్యాంగంపై చర్చకు లోక్సభ, రాజ్యసభ ఎంపీలందరూ అంగీకరించారు. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం రాజ్యాంగంపై చర్చ తేదీలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రకటించారు. లోక్సభలో డిసెంబర్ 13, 14 తేదీల్లో, రాజ్యసభలో 16, 17 తేదీల్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతుందని మంత్రి కిరణ్ రిజుజు స్పష్టం చేశారు.
…………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
