* అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ
* ముగ్గురు చిరు వ్యాపారులు దుర్మరణం
ఆకేరు న్యూస్, వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ బీభత్సంతో ఈ ప్రాంతం భీతావహంగా మారింది. హైదరాబాద్ `బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా.. వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు. వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ డ్రైవర్ సైతం క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు వంద విూటర్ల దూరం నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
