* తడిసి ముద్దయిన వరి ధాన్యం
* పలువురు రైతులు ఆవేదన
ఆకేరున్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో అనుకోని వర్షంతో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. గత రెండు రోజులుగా ఫెయిన్జల్ తుఫాను ప్రభావంతో మబ్బులు చేసి ఉండడంతో ఆందోళన చెందిన రైతులు వరి కోసి ధాన్యంను ఉప్పల్ – కమలాపూర్ రహదారిపై ఆరబోసుకుంటున్నారు. సోమవారం సాయంత్రం కురిసిన అనుకోని వర్షానికి రహదారిపై ఆరబోసిన వడ్లతో పాటు ఐకెపిల్లో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం కూడా తడిసి ముద్దయ్యాయి. వర్షంలోనే కొంత మంది రైతులు వరి ధాన్యాన్ని అమ్మకానికి ట్రాక్టర్లలో తరలించారు. దీంతో తడిచిన ధాన్యాన్ని సంచికి కిలో చొప్పున తక్కువ తూకం వేస్తున్నారని, దీంతో నష్ట పోవాల్సి వస్తుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
