* హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరున్యూస్, హైదరాబాద్: అవినీతిని తరిమేద్దాం దేశాభ్యుదయానికి పునాదులు వేద్దామని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఏసీబీ వారోత్సవాల్లో భాగంగా ఏసీబీ కరపత్రం, పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎవరైనా లంచం అడిగితే ఇవ్వకండి- ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా మీ పని చేసేందుకు లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 సంప్రదించలన్నారు. జిల్లాను అవినీతి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ అవినీతి నిరోధక శాఖకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ వరంగల్ రేంజ్ డిఎస్పి సాంబయ్య గారు మరియు ఇన్స్పెక్టర్ సమ్మయ్య పాల్గొన్నారు.
………………………………………..