Warangal Electricity Shock Girl Death
* తెగిపడిన విద్యుత్ వైర్ తాకి 14 ఏళ్ల బాలిక మృతి
ఆకేరు న్యూస్, వరంగల్:
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం, విషాదాన్ని నింపింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన సిరివెన్నెల (14) అనే బాలిక ప్రమాదవశాత్తు కింద తెగిపడి ఉన్న విద్యుత్ వైరును తాకడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురైంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే 108 ఈఎంటీ దస్రూ, పైలట్ కిరణ్ అత్యంత వేగంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర స్పృహతప్పి పడిపోయిన బాలికను కాపాడేందుకు ఈఎంటీ సిబ్బంది సీపీఆర్ (CPR) చేస్తూ ప్రాణాలు నిలిపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే, అప్పటికే బాలిక మృతి చెందినట్లు సిబ్బంది ధ్రువీకరించారు. 14 ఏళ్ల వయస్సులోనే బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనతో నల్లబెల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
