National Flag Hoisting Clash
* కిందపడిపోయిన ఫ్లాగ్
ఆకేరు న్యూస్, హనుమకొండ:
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ వేడుకల్లో స్థానిక రాజకీయం రచ్చకెక్కింది. జాతీయ జెండా ఎగురవేసే విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుండగా, ఎవరు జెండాను ఆవిష్కరించాలనే దానిపై రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాట మాట పెరిగి ఇరువర్గాల నాయకులు, మద్దతుదారులు ఒకరినొకరు తోసుకున్నారు. తోపులాట తీవ్రమవ్వడంతో అనూహ్యంగా జాతీయ జెండా ఊడి కిందపడిపోయింది.
జాతి అంతా గర్వించే జాతీయ పతాకానికి ఈ విధంగా అవమానం జరగడంపై స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన స్వాతంత్ర్య వేడుకల్లో కూడా ముఠా రాజకీయాలు చేయడం ఏంటని రెండు వర్గాలపై మండిపడ్డారు.
దేశ గౌరవానికి ప్రతీకైన త్రివర్ణ పతాకాన్ని రాజకీయ స్వార్థానికి వాడుకోవడంపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
