Godavari Pushkaralu Telangana 2027
* వైభవంగా గోదావరి పుష్కరాలు నిర్వహించాలి
* రూ.1000 కోట్లతో ఏర్పాట్లు
– అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణ, తెలంగాణ అంటే గోదావరి పుష్కరాలు అనేలా మన రాష్ట్ర ప్రత్యేకతను దేశం నలుమూలలా చాటి చెప్పాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. 2027 జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల మహా ఘట్టానికి అంకురార్పణ పడింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం సందడి నెలకొంది. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతి వెలిగించి పుష్కరాల సమన్వయ ప్రత్యేక అధికారి కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఇప్పటివరకు గోదావరి పుష్కరాలు అనగానే రాజమహేంద్రవరం గుర్తుకొచ్చేది. కానీ ఈసారి అలా జరగకూడదు. సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో మంజూరు చేసిన రూ. 1000 కోట్ల నిధులతో ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమీక్షలో అధికారులు ఘాట్ల నిర్మాణ వివరాలను మ్యాప్‌ల ద్వారా వివరించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో 5 కిలోమీటర్లకు పైగా అత్యాధునిక ఘాట్లు రాబోతున్నాయని, రోడ్లు, పోలీసు, వైద్య, పర్యాటక శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. తాత్కాలిక హడావుడి పనులొద్దు.. భవిష్యత్ తరాలు కీర్తించేలా ప్రతి పనీ నాణ్యత, శాశ్వత ప్రాతిపదికన జరగాలని స్పష్టం చేశారు. నీటి ఉధృతిని తట్టుకునేలా ఘాట్ల వద్ద పటిష్టమైన గ్రిల్స్, మహిళల కోసం సురక్షితమైన వసతులు ఉండాలని ఆదేశించారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
