kamalapur Python Rescue
* జూ పార్కుకు తరలింపు
* వన్యప్రాణుల సంచరిస్తే సమాచారం ఇవ్వండి
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి శివారులో బుధవారం కరుణాకర్ రెడ్డి వరి పొలంలో ఐదు అడుగుల కొండచిలువ భయాందోళనకు గురిచేసింది. ఈ విషయమై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ కొండచిలువను బీట్ ఆఫీసర్ అశోక్, రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా పట్టుకుని హన్మకొండలోని జూ పార్కుకు తరలించినట్లు ఆయన తెలిపారు.
* వన్యప్రాణులు సంచరిస్తే సమాచారం ఇవ్వండి
ఈ సందర్భంగా బీట్ అధికారి అశోక్ మాట్లాడుతూ… ఎక్కడైనా వన్యప్రాణులు లేదా అటవీ జంతువులు సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూగజీవాలకు, వన్యప్రాణులకు హాని తలపెట్టవద్దని గ్రామస్తులకు, రైతులకు విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
