PM Modi Nepal Flood Relief
* రంగంలోకి C-17 విమానాలు.. రెస్క్యూ షురూ
* నేపాల్ ప్రధాని బాల్దేవ్తో మోదీ సంభాషణ..
ఆకేరు న్యూస్, డెస్క్: అకస్మాత్తుగా విరుచుకుపడిన భీకర వరదలతో (Flash Floods) నేపాల్ అతలాకుతలమైంది. ఈ విపత్తుతో తీవ్ర నష్టం వాటిల్లిన నేపాల్‌కు భారత్ అన్నివిధాలా అండగా నిలుస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
నేపాల్ ప్రధాని బా లేన్ షా (Balen Shah)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, వరదల వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టసమయంలో భారత్ నుంచి పూర్తిస్థాయి మానవతా సాయం అందిస్తామని, సహాయక చర్యల్లో రెస్క్యూ బృందాలు నిరంతరం కోఆర్డినేట్ చేసుకుంటాయని తెలిపారు.
* రంగంలోకి భారత వైమానిక దళం..
బాధితులకు తక్షణ ఉపశమనం అందించేందుకు వీలుగా టెంట్లు, మందులు, ఆహార పదార్థాలు వంటి టన్నుల కొద్దీ రిలీఫ్ మెటీరియల్‌తో కూడిన భారత వైమానిక దళానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ మరియు C-130J సూపర్ హెర్క్యులెస్ రవాణా విమానాలు నేపాల్ బయలుదేరాయి.
* భారత యాత్రికులు గల్లంతు..
మరోవైపు, వరద ఉధృతికి కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. ప్రమాదంలో చిక్కుకున్న భారతీయుల సమాచారం కోసం, సహాయం కోసం విదేశాంగ శాఖ నేపాల్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.
