Collector Bhorkhade Hemant, Mulugu Voter List Revision
* ఆగస్టు 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు
* ఓటర్లు జాబితాలో పేర్లు,తమ వివరాలను సరిచూసుకోవాలి
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
ఆకేరు న్యూస్,ములుగు :
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా రేపు ఆగస్టు 27న జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సభల్లో సంబంధిత పోలింగ్ కేంద్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని ఓటరు జాబితాలను ప్రజల సమక్షంలో చదివి వినిపిస్తారని పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకునేందుకు అవకాశం కల్పిస్తారని తెలిపారు.
అర్హులైన పౌరులు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు నమూనా–6, పేరు తొలగింపు లేదా అభ్యంతరాల కోసం నమూనా–7, వివరాల సవరణ కోసం నమూనా–8ను వినియోగించుకోవాలని, ఓటర్ల వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పారదర్శకత పాటించనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రక్రియ రేపటి నుంచి సెప్టెంబర్ 20 వరకు సమీప గ్రామ పంచాయతీ భవనం లేదా వార్డు కార్యాలయంలో విచారణలు చేపట్టనున్నారని వివరించారు. ఈ ప్రక్రియపై సందేహాలు లేదా సమస్యలు ఉంటే దూరవాణి సంప్రదింపుల నమోదు సేవ, జాతీయ ఓటరు సేవల ఫిర్యాదుల అంతర్జాల వేదిక ద్వారా లేదా 1950 ఉచిత సహాయ సంఖ్యను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
