Warangal Hospital Pregnant Woman Video Case
* బాత్రూమ్లో గర్భిణి వీడియో తీసిన ల్యాబ్ టెక్నీషియన్!
* డీఎంహెచ్ఓ పై ఫిర్యాదుకు సిద్ధమైన సంఘాలు
ఆకేరు న్యూస్, వరంగల్: వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి పట్ల ఆసుపత్రి సిబ్బందే అత్యంత నీచంగా ప్రవర్తించిన ఘటన వరంగల్ లో తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి వాష్‌రూమ్‌లో సదరు మహిళను రహస్యంగా తన మొబైల్ ఫోన్లో వీడియో తీస్తూ ల్యాబ్ టెక్నీషియన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.
* బాత్రూమ్లో గర్భిణి వీడియో..
మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి గర్భిణి వైద్య పరీక్షల కోసం వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఆసుపత్రిలోని వాష్‌రూమ్‌కు వెళ్లగా, అక్కడే పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి మనోహర్ రహస్యంగా తన మొబైల్ ఫోన్ ద్వారా ఆమెను వీడియో తీయడం మొదలుపెట్టాడు. విషయాన్ని గమనించిన బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసింది.
* తప్పించుకునేందుకు నిందితుడి యత్నం..
బాధితురాలి అరుపులు విని బయట ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, ఆసుపత్రిలోని ఇతరులు వెంటనే అక్కడికి పరుగున వచ్చారు. మనోహర్ అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించగా, బాధితుల బంధువులు అతడిని అడ్డుకుని దేహశుద్ధి చేశారు.
* పోలీసుల దర్యాప్తు…
సమాచారం అందుకున్న మట్టెవాడ పోలీసులు వెంటనే ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
* జాతీయ మాల మహానాడు డిమాండ్..
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ మాల మహానాడు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పణికల శ్రీనివాస్ ఒక ప్రకటనలో అధికారులను కోరారు. ఆసుపత్రి యజమాన్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డీఎంహెచ్ఓ (DMHO) కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
