* ప్రశాంత్ కిషోర్
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ: రాజకీయ వ్యూహకర్త అక్టోబర్ 2న బీహార్లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రోజే పార్టీ పేరు, నాయకత్వంతో సహా అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. బీహార్లో ‘జన సురాజ్’ పేరుతో పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆదివారం మాట్లాడుతూ అక్టోబర్ 2న కొత్త పార్టీతో పాటు నాయకత్వ ప్రకటన గురించి తెలియజేస్తానన్నారు. అక్టోబర్ 2న ఏర్పాటవుతున్న ఈ పార్టీకి ప్రజలే నాయకత్వ పాత్ర పోషిస్తారన్నారు. అలాగే కొత్త పార్టీ ఏర్పాటు తర్వాత కూడా తన పాదయాత్ర ఆగదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మరో ఏడాది లేదా రెండేళ్ల వరకు పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
