* పోలీస్ ల చేతిలో బాడీ వార్న్ కెమెరాలు ..
ఆకేరు న్యూస్, వరంగల్: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో మందుబాబులను కట్టడి చేసేందుకు వరంగల్ ట్రాఫిక్ విభాగంలోకి బాడీ వార్న్ కెమెరాలు వచ్చేసాయి. ఇకపై మందుబాబులు తస్మాత్త్ జాగ్రత్తగా వుండాలని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ తెలియజేసారు. ట్రైసిటీ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలతో పాటు శాంతి భద్రతల పర్యవేక్షణ విధులు నిర్వహించే సమయంలో ప్రజల నుండి ఎదురయ్యే సమస్యలను, దాడులను నియంత్రించి పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయము నుండి బాడీ వార్న్ కెమెరాలు మంజూరయ్యాయని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అధికారులకు అందజేసారు. కమీషనరేట్ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు మూడు చొప్పున బాడీ వార్న్ కెమెరాలు అందజేశారని తెలిపారు. ఇకపై నగరంలో ట్రాఫిక్ పోలీసులు బాడీ వార్న్ కెమెరాలను ధరించి తనీఖీలు చేస్తారని తెలిపారు. తద్వారా తనిఖీల సమయంలో వాహనదారులు పోలీసులపై దాడులకు పాల్పడినా, దూషించినా, మరేతర విధులను ఆటంకపరిచే విధంగా ప్రవర్తించినా బాడీ వార్న్ కెమెరా సంఘటన స్థలంలో జరిగిన వాస్తవాలను చిత్రికరిస్తుందని తెలియజేశారు. అలాగే ట్రాఫిక్ అధికారులు తనీఖీల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు అనువుగా వుంటుందని ఏసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు రామకృష్ణ, షూకూర్, నాగబాబు, ట్రాఫిక్ ఎస్సైలు పాల్గ్గొన్నారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
