* సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని, దానికి పొట్టి శ్రీరాములు పేరు పెడతామ ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chief Minister Chandrababunaidu) తెలిపారు. ఈరోజు తెలుగు వారంతా గర్వంగా చెప్పుకునే రోజన్నారు. విజయవాడ(Vijayawada)లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం.. పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదని చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల మనమంతా తెలుగు వాళ్లం అంటున్నామని అన్నారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగం ద్వారా సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని సీఎం చంద్రబాబు అన్నారు. నేటి ఆమరణ దీక్షలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని చెప్పారు. గత ఐదేళ్ల పాలనను ప్రజలంతా గుర్తు చేసుకోవాలని బాబు అన్నారు. అమరావతి(Amaravathi)ని విధ్వంసం చేసేందుకు మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని తెలిపారు.
……………………………………………