* వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి
* వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఆకేరున్యూస్, అమరావతి : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లోనే ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నాయకులు కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ తనూజ రాణి, వరుదు కల్యాణి, బుడి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
