
* వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల మృత దేహాలు లభ్యమయ్యాయి. ఓ మృత దేహం గుర్తు పట్టలేని విధంగా ఉండగా , మరో మహిళ మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. మంగళవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో.. గోనె సంచిలో కాళ్లు చేతులు కట్టేసి ఓ మహిళా మృతదేహాన్ని గర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పోలీసులు పరిశీలించారు. మహిళా మృతదేహాన్ని ఓ ఆటోలో తీసుకువచ్చి అక్కడ పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు సుమారు 35 నుంచి 40ఏళ్ల వయసు ఉన్నట్లు, ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పుర సమీపంలోని ఓ బ్రిడ్జి కింద మహిళ డెడ్ బాడీ తీవ్ర కలకలం రేపింది. మంగళవారం మృతదేహం ఒంటిపై బట్టలు లేని డెడ్ బాడీని చూసిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు అఘాపురాకు చెందిన బేగంగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు ఆఘాపురా నుంచి ఆటోలో కిస్మత్పుర వచ్చింది. అనంతరం మహిళ కిస్మత్‌పురలోని కల్లు కపౌండ్లో కల్లు తాగింది. ఆపై ఆమెను తీసుకువెళ్లింది ఎవరు..? ఆమెను హత్య చేసింది ఎవరు..? అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. అత్యాచారం ఆపై హత్య కోణంలో దర్యాప్తు జరుగుతుంది. కేసుకు సంబంధించి సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
…………………………………………………..