* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి సంబంధించి సమగ్రమైన నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM REVANTHREDDY) అధికారులను ఆదేశించారు. ఇందుకు వచ్చే నెల 1వ తేదీ వరకు టెండర్ల ప్రక్రియకు కార్యాచరణను రూపొందించాలన్నారు. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల గోదావరి జలాలను తరలింపు అంశంపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి నీటి పారుదల శాఖ, జలమండలి అధికారుల సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి ఎంతమేరకు నీటిని తరలించాలని.. ఎంత ఖర్చవుతుందన్న విషయాలపై పూర్తి అధ్యయనం జరగాలని ఆదేశించారు. ఈ విషయంలో మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
