Published:
Updated: 23 Nov 2024 • 11:50 AM
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : శ్రీ చైతన్య కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మియాపూర్ శ్రీ చైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కౌశిక్ రాఘవ ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతిని కాలేజీ యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో విద్యార్థి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
……………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
