* మమ్మల్ని ఇలాగైనా బతకనివ్వండి
* కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ కరువైంది..
* నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన
* గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్
* ఫిరాయింపులతోనే ఇటువంటి ఘటనలని వెల్లడి
ఆకేరు న్యూస్, జగిత్యాల : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీ కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మీకు.. మీ పార్టీకి ఓ దండం.. మమ్మల్ని ఇలాగైనా బతనివ్వండి’ అని మండిపడ్డారు. తన ప్రధాన అనుచరుడు, జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి (58)ని దారుణంగా హత్యకు నిరసనగా తన అనుచరులతో కలిసి జగిత్యాల-ధర్మపురి రహదారిపై జీవన్ రెడ్డి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మాకు నలుగురికి సేవ చేయడమే తెలుసు.. ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని అయినా ప్రజలకు సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం.. మానసికంగా అవమానాలకు గురవుతున్నా భరించాం.. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు.’అని అడ్లూరి లక్ష్మణ్‌ను జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన అనుచరుడిని హత్య చేయడం అంటే తనను కూడా హత్య చేసినట్లే అని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపులతోనే ఇటువంటి ఘటనలని అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకే రక్షణ లేదని ఆరోపించారు. జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఆయనకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఫోన్ చేశారు. గంగారెడ్డి మరణం నేపథ్యంలో జీవన్ రెడ్డిని పరామర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై జీవన్ రెడ్డి అసహనంగా ఉండటంతో ఆయన్ను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ రెడ్డి వినిపించుకోలేదు. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగాలని మహేశ్‌కుమార్‌ను ఎదురు ప్రశ్నించారు. చంపించుకోవడానికే పార్టీలో ఉన్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పార్టీలో ఉండలేనని చెప్పి, ఫోన్‌ను పక్కన పడేశారు.
……………………………………………………………….