ఆకేరు న్యూస్, అనంతపురం : ఏపీ(AP)లో కురుస్తున్న వర్షాలకు సినీ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వరదల్లో చిక్కుకున్నారు. అనంతపురం(Ananthapuram)లో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన పుట్టపర్తి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణీస్తున్న కారు వరదలో చిక్కుకుంది. స్పందించిన పోలీసులు ఆయనను మరో దారిలో అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పండమేరు వాగు ఉప్పొంగింది. వరద నీరు సమీప కాలనీలను, రహదారులను ముంచెత్తింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. భారీ వర్షాలకు 44వ నేషనల్ హైవే పై భారీగా వర్షపు నీరు చేరడంతో 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
