పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య
* రైస్ మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న నిందితుడు
* తల్లి పక్కలో నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లాడు
* బాలికను ఎత్తుకెళ్తున్న వీడియో సీసీటీవీలో రికార్డు
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : తల్లి పక్కన నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య (6 year old girl raped and killed) చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లిలో ఒక రైస్ మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న బలరామ్ తాగిన మత్తులో తల్లి పక్కలో నిద్రిస్తున్న ఆరేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. బాలిక కనిపించకపోయేసరికి తల్లి అక్కడున్న స్థానికులతో చుట్టుపక్కల అంతా గాలించేసరికి పక్కనే ఉన్న చెట్ల పొదల్లో శవంగా కనిపించింది. అక్కడున్నవారు వెంటనే 100కు డయల్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకొని పక్కనే ఉన్న రైస్ మిల్లు సిసి టీవీని పరిశీలించారు. అందులో బలరామ్ బాలికను పొదల్లోకి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అక్కడే ఉన్న స్థానికులు నిందితుడిని పట్టుకొని తమకు అప్పగించారని తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
———–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
