* రేవ్ పార్టీ కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
* డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్
* రేవ్ పార్టీకి A వెళ్ళలేదని బుకాయింపు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : నటి హేమ ( Hema ) ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌజ్లో జరిగిన రేవ్ పార్టీ ( Rave Party ) కి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు హాజరయ్యారు. రాజకీయ నాయకుడి కొడుకు పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో పెద్ద ఎత్తున నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అందరిని అదుపులోకి తీసుకున్నారు. రక్త నమూనాలను కూడా తీసుకున్నారు.
* నటి హేమ బుకాయింపు
నటి హేమ తాను ఏ రేవ్ పార్టీకి వెళ్ళలేదని తాను ఫామ్ హౌజ్లో చిల్ అవుతున్నానని వీడియో సోషల్ మీడియాకు రిలీజ్ చేసింది. తనను అనవసరంగా ఈ వివాదంలోకి లాగొద్దని కూడా మీడియాను వేడుకున్నది. డ్రగ్స్ నిర్థారణ పరీక్షలో హేమ పాజిటివ్ గా తేలింది. బెంగళూర్ సెంట్రల్ క్రైం బ్రాంచ్ ( CCB ) పోలీసులు విచారణ హాజరు కావాలని మూడు సార్లు నోటీసులు పంపించారు.తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని విచారణకు హాజరు కాలేనని సీసీబీ పోలీసులకు లేఖ రాసింది. హేమ హాజరుకాక పోవడంతో సోమవారం అమెను హైదరాబాద్లో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
——————-