పవన్ కళ్యాణ్
* 10.30కు 22 వేల ఆధిక్యంలో
* బలమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్న పవర్ స్టార్
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైనది. కొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఒక్క సీటుపై అందరి చూపు ఉంది. అదే పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారనగానే.. దేశ విదేశాల నుంచి వచ్చి ఓటేసిన ఎంతో మంది ఓటర్లు రేపు అంటే జూన్ 4న రిలీజవబోయే ఫలితాలపైన క్యూరియాసిటీ పెంచుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న ఎన్నికలు ఒక లెక్క .. ఈ సారి ఎన్నికలు ఒక లెక్క అన్నట్లుగా సాగిన ఏపీ ఎన్నికల గురించి నేషనల్ మీడియా సైతం ఫోకస్ పెంచిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అన్న విషయాన్ని ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే.
భారీ బలగాలు
మరోవైపు ఏపీ పోలీసుల ఫోకస్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైనే పడింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని ఏపీ పోలీసులు డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. పిఠాపురానికి భారీ ఎత్తున పారా మిలటరీ బలగాలను పంపించారు. ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పిఠాపురాన్ని క్షుణ్ణంగా పహారా కాస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని వైసీపీ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని పవన్ ను ఓడించడానికి..ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తమ శాయశక్తులా ప్రయత్నించింది.
ఎగ్జిట్ పోల్స్.. ఎగ్జాక్ట్గా..
ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఆయన గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. దీంతో ఆ ఓటమి నేర్పిన పాఠాలను పరిగణనలోకి తీసుకుని పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నారు.జూన్ 4న పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయం అని వైసీపీకి అనుకూలంగా ఉన్న సర్వేలు సైతం వెల్లడించడంతో.. అందరి దృష్టి అంతా పిఠాపురంపైనే పడింది. పవన్ భారీ మెజార్టీతో గెలిస్తారని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అలానే కొనసాగుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. 10.30కు 22 వేల ఆధిక్యంలో ఉన్నారు. బలమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు..
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
