
* స్లాబ్ కూలడంతో నలుగురు కూలీలకు గాయాలు
* ఇద్దరు కూలీల పరిస్థితి విషమం
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః జనగామ ఎమ్మెల్యే బీఆర్ ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో భవన నిర్మాణ కూలీలకు గాయాలయ్యాయి. ఒక్క సారిగా స్లాబ్ కూలడంతో స్లాబ్ కింద ఉన్న నలుగురు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి, వెంటనే యూనివర్సిటీకి చెందిన సిబ్బంది గాయపడిన కూలీలను హుటాహుటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
……………………………………………….