
* వంతెన గోడను ఢీకొన్న వాహనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కర్ణాటక(Karnataka)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏపీవాసులు మృతి చెందారు. వంతెన గోడను వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హిందూపురం(Hindupuram) వాసులుగా పోలీసులు గుర్తించారు. హిందూపురం నుంచి కర్ణాటక యాద్గిర్ జిల్లా షహర్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిని నాగరాజు, సోమ, నాగభూషన్, మురళిగా గుర్తించారు.
……………………………..