సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఆపరేటర్ మృతి
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : సింగరేణి బొగ్గు గనిలో జరిగిన ప్రమాదం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెద్దపల్లిలోని సింగరేణి బొగ్గు గనిలో ఎల్హెచ్డీ యంత్రం నుంచి కిందపడి ఇజ్జగిరి ప్రతాప్ అనే ఆపరేటర్ మృతి చెందారు. ఎల్హెచ్డీ యంత్రం గోడను ఢీకొట్టడంతో.. మిషన్ కింద పడిపోయి ఆపరేటర్ అక్కడిక్కడే చనిపోయారు. దీంతో ఆయన మృతదేహాన్ని సింగరేణి ఏరియా దవాఖానకు తరలించారు. ప్రతాప్ మృతదేహానికి టీబీజీకేఎస్ నేతలు మిర్యాల రాజిరెడ్డి, తదితరులు నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం రామగిరి మండలం పన్నూరు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
—
Please tell us what is wrong. Your report will be sent to the website team.
