
* అత్తమామలను త్వరలో అరెస్టు చేస్తాం
* పెద్దపల్లి డీసీపీ, గోదావరిఖని ఏసీపీ వెల్లడి
ఆకేరు న్యూస్, పెద్దపల్లి : వివాహిత హత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ పరిది వకీల్‌పల్లి ప్లాట్స్ లో ఆదివారం పూసల రమాదేవి అలియాస్ ప్రశాంతి హత్య కేసు లో నిందితుడి అరెస్ట్ వివరాలను పెద్దపెల్లి డీసీపీ పి.కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన మేడి రమాదేవి అలియాస్ పూసల ప్రశాంతిని పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్‌పల్లి ప్లాట్స్ కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9) జ్యోత్స ఉన్నారు.. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది ఈ క్రమం లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి రోజు వారి దాంపత్య వివాదాల కారణంగా కృపాకర్ మృతురాలిని చంపాలని నిర్ణహించుకొని, అప్పుడు మాత్రమే తన సమస్య పరిష్కారం అవుతుంది రమాదేవి చంపాలనే ఉద్దేశ్యంతో తన ఇంట్లోని కత్తిని తీసుకొని ఆమె తల, మెడ, తుంటి, కడుపుపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్త స్రావం జరిగి రక్తపు మడుగులో నేలపై పడి అక్కడికక్కడే మరణించింది. మేడి కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
హత్య కు సంబందించిన సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేరానికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు, కారణాల సమాచారం సేకరించారు. పెద్దపెల్లి డీసీపీ కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పరిశోధన అధికారి ఆధ్వర్యంలో రామగిరి ఎస్ ఐలు శ్రీనివాస్, దివ్యలు ప్రత్యేక టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మదగిన సమాచారం ఆధారంగా నిందితుడు కృపాకర్‌ను 0CP-2 కమాన్ ఏరియా లద్నపూర్ వద్ద బుధవారం పట్టుకొని , హీరో హోండా, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. హత్య కేసులో మిగిలిన అత్తమామలను త్వరలో అరెస్టు చేస్తామని వారు వివరించారు.
………………………………………