విభజన సమస్యలపై జరిగే భేటీలో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తెలంగాణలో కలపడమే తొలి అంశంగా ఉండాలి. మాజీ మంత్రి హరీశ్‌రావు
* బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు చేతిలో ఉన్నాయి
* విభజన సమస్యలపై లేఖ రాయడం సంతోషం
* మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విభజన సమస్యలపై జరిగే భేటీలో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను తెలంగాణలో కలపడమే తొలి అంశంగా ఉండాలని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సూచించారు. విభజన సమస్యల పరిష్కారంపై చర్చిద్దామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) లేఖ రాయడం సంతోషకరమన్నారు. చంద్రబాబు అత్యంత శక్తివంతుడని తెలిపారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు చేతిలో ఉన్నాయని అన్నారు. విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును, ఖమ్మానికి చెందిన 7 మండలాలను ఏపీలో కలిపారని వాటిపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దృష్టి సారించాలని హరీశ్‌రావు సూచించారు. ఏడు మండలాల అంశం తేల్చిన తర్వాతే మిగిలిన అంశాలపై ముందుకు వెళ్లాలని తెలిపారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
