
*ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే అమ్మాలని ఎంపీడీవో గుండె బాబు అన్నారు. బుధవారం దేశరాజుపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించి,మాట్లాడారు.ఇటుక బట్టీలు, స్టోన్ క్రషర్లు, ఇసుక, సిమెంట్, మేస్త్రీలు, స్టీల్, ఐరన్ వంటి నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే లబ్ధిదారులకు అందించాలని, నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ప్రతి గ్రామ పంచాయతీ కార్యదర్శి సూపర్వైజ్ చేస్తూ,ఎవరైనా అధిక ధరలకు విక్రయాలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తే, ఆ వాహనాల నంబర్లను పోలీసులకు తెలియజేసి, వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు సహాయం చేయాలని కోరారు. నిర్మాణ కూలిని వీలైనంత తక్కువగా తీసుకోవాలని మేస్త్రీలకు సూచించారు
………………………………….