Nidhhi Agerwal ED Inquiry
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సినీ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఈడీ ప్రశ్నించిన నేపథ్యంలో నిధి అగర్వాల్‌కు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం ద్వారా వచ్చినట్లు ఆరోపణలు ఉన్న నగదు లావాదేవీలు, బ్యాంకు ఖాతాల్లోకి జమ అయిన మొత్తాలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్ కోణంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మార్గాల్లో చెల్లింపులు జరిగాయి అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
* గతంలో సీఐడీ విచారణ
ఇదే వ్యవహారంలో నిధి అగర్వాల్‌ను తెలంగాణ సీఐడీ కూడా గతంలో విచారించింది. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై నమోదైన కేసులో పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అధికారులు ప్రశ్నించారు. 2025లో నమోదైన కేసులో నిధి అగర్వాల్‌తో పాటు రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, అనన్య నాగళ్ల తదితర సినీ ప్రముఖులు, ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
