Will Smith in Raaka Movie ?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘రాకా’ పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు తెరపైకి వచ్చింది. సినిమాలో ఆయన కీలక ప్రతినాయకుడి పాత్రలో నటించే అవకాశం ఉందనే వార్తలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ‘రాకా’లో అల్లు అర్జున్‌కు ఎదురుగా బలమైన ప్రత్యర్థి పాత్ర కోసం విల్ స్మిత్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్రకు ఆయన అయితేనే సరిపోతారని దర్శకుడు అట్లీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాది గా ఆయనతో చర్చలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో ఆయన భాగస్వామ్యంపై మరింత ముందడుగు పడినట్లు వార్తలు వస్తున్నాయి.
* విదేశీ షెడ్యూల్లో షూటింగ్?
విల్ స్మిత్ సినిమాలో నటించడం ఖరారైతే.. ఆయనకు సంబంధించిన సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయన అందుబాటును బట్టి షూటింగ్ లొకేషన్‌ను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన దుస్తులు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే షూటింగ్ తేదీలు, లొకేషన్‌పై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
