Sundeep Kishan Sigma Movie
* అక్టోబర్ 2న ధియేటర్లలో రచ్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా, స్టార్ యాక్టర్ జయపాల్ (తమిళ నటుడు విజయ్) కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల విడుదలైన టీజర్, తొలి రెండు సింగిల్స్‌కు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో సినిమా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వరుస సెలవులు, లాంగ్ వీకెండ్ కలిసిరానుండటం ఈ సినిమాకు కలెక్షన్ల పరంగా పెద్ద అడ్వాంటేజ్‌గా మారనుంది.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో సందీప్ కిషన్ ఎంతో ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు. వార్మ్ లైటింగ్, ఒక డాగ్ పక్కన నిలబడి కిటికీ నుంచి వస్తున్న గోల్డెన్ సన్‌లైట్ మధ్య సందీప్ ఉన్న లుక్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌పై క్యూరియాసిటీని పెంచుతోంది.
ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బు థాసన్, యోగ్ జపే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్ స్వరాలు అందిస్తుండగా, క్రిష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హరిహరసుతన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చివరిదశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం కోసం త్వరలోనే భారీ ప్రమోషన్లు ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
