Actress Sanjana Supports Tamil Nadu CM Vijay
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
తమిళనాడు సీఎం విజయ్‌కు నటి సంజన మద్దతుగా నిలిచారు. ఆగస్టు 15న సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడం తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. రాజకీయ వర్గాల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియాలో సైతం విజయ్, త్రిషల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా నటి సంజన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. “విజయ్ పాలన గురించి మాట్లాడాలి కానీ, ఆయన వ్యక్తిగత జీవితంలో మీకేం సంబంధం?” అంటూ ఆమె ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రి పనితీరు, ప్రజలకు అందిస్తున్న పాలన, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత విషయాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
* విజయవంతమైన రాజకీయ ప్రయాణం
సీఎంగా విజయ్ విజయవంతంగా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని సంజన కొనియాడారు. ఆయన రాజకీయంగా ఎదుగుతుండటం కొంతమందికి కంటగింపుగా మారిందని వ్యాఖ్యానించారు.. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేని కొందరు.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అలాగే విజయ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కూడా సంజన ప్రశంసలు కురిపించారు. ప్రజల కోసం పలు కార్యక్రమాలను అమలు చేస్తూ, సీఎంగా నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. తమిళనాడులో చేపడుతున్న కొన్ని కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకురావడం మాత్రం సరికాదని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
* ఆమె చాలా గొప్ప నటి
ఇదే సమయంలో నటి త్రిష గురించి కూడా సంజన మాట్లాడారు. త్రిష చాలా గొప్ప నటి అని, దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అయితే విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని సంజన వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని, ఇలాంటి వ్యక్తిగత అంశాలను రాజకీయ చర్చగా మార్చడం బాధాకరమన్నారు.
* సంజన, త్రిష కాంబినేషన్
తెలుగు ప్రేక్షకులకు కూడా సంజన, త్రిష ఇద్దరూ సుపరిచితమే. వీరిద్దరూ తెలుగులో కలిసి నటించిన చిత్రం ‘బుచ్చిగాడు’. ప్రభాస్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలో ప్రభాస్‌కు జోడీగా త్రిష, మరో కీలక పాత్రలో సంజన కనిపించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
