Adilabad
* నవజాత శిశువు మృతి
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని పిల్లల వార్డులో ఏసీ యూనిట్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. పొగతో ఊపిరాడక ఓ నవజాత శిశువు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో పిల్లల వార్డులో ఉన్న 26 మంది చిన్నారులను సిబ్బంది, తల్లిదండ్రులు అప్రమత్తమై సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దట్టమైన పొగల కారణంగా వార్డులో నుంచి బయటకు రావడం కష్టంగా మారడంతో.. అద్దాలను పగలగొట్టి మరీ చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని ఆదిలాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
