* గిరిజన ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు
* ఆన్లైన్లో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు
* గిరిజన విద్యార్థుల కోసం మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లు
* ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు వరాలు
ఆకేరు న్యూస్, విజయవాడ : సాంకేతికంగా ఎంతో ముందుకు పోతున్నా, గిరిజనులు ఇంకా వెనకబడే ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ( Chandra babu ) తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గిరిజనులకు చంద్రబాబు వరాలు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో సుడిగాలి వచ్చిందని, అప్పుడున్న సీఎం, పార్టీ కొట్టుకుపోయాయని, మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదని తెలిపారు. అరాచక, అవినీతి దోపిడీ పాలన అంతమైందన్నారు. గిరిజనులనుద్దేశించి మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, విజయవాడ కేంద్రాల్లో గిరిజనుల కోసం మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజనుల స్వయం ఉపాధికి ఇన్నోవా కార్లు అందజేస్తామని, గిరిజన గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు నిర్మిస్తామని, మంచినటి సరఫరా అందిస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో నెట్, సెల్ఫోన్ కనెక్టివిటీ పెంచేలా టవర్లు పెంచుతామన్నారు. గిరిజనుల్లో మాతా శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్లైన్లో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టేందుకు అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు.
————————————–