* ఏరియల్ సర్వే ద్వారా వయనాడ్ పరిస్థితి తీవ్రతపై అంచనా
* జాతీయ విపత్తుగా ప్రకటించేనా?
ఆకేరు న్యూస్ డెస్క్: ప్రకృతి ప్రకోపానికి అతలాకుతలమైన కేరళ (Kerala) లోని వయనాడ్ (Wayanad) ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) పర్యటించారు. కొండచరియలు (Landslides)విరిగిపడిన ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధిత ప్రాంతాల్లో కేరళ సీఎం విజయన్ (Kerala CM Vijayan) తో కలిసి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే (Aerial Survey) నిర్వహించారు. అనంతరం ఘటనాస్థలంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రధాన మంత్రి సహాయ శిబిరం, ఆస్పత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ఉన్నతాధికారులుతో ప్రధాని మోడి (Prime Minister Modi) సమీక్షిస్తున్నారు. కాగా, ప్రధాని పర్యటనపై లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పిఎం మోడి పర్యటిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమన్నారు. ఇప్పటికైన వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటిచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
——————–