* తెలంగాణలో భారీ వర్షాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో వాన దంచి కొట్టింది. బుధవారం రాత్రి ఎడతెరిపి లేకుండా వాన పడింది. మెదక్ (Medak) జిల్లాలోని ఆర్డీవో ఆఫీసు వద్ద అత్యధికంగా 119.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. మసాయిపేటలో 112 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో 99.8 మి.మీ., హైదరాబాద్లోని బండ్లగూడ(Bandlaguda)లో 98.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
